ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బస్తీవాసులు
ABN , First Publish Date - 2020-10-31T18:56:07+05:30 IST
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బస్తీవాసులు

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇంటిని 200 మంది బస్తీవాసులు ముట్టడించారు. రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.