సంజయ్ వయసు కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదు: జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-03-16T17:05:42+05:30 IST
హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్ వయసు సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్ వయసు సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. పదవి వచ్చి 24గంటలు కాకముందే బండి సంజయ్ మితిమీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు జీరో అని జీవన్‌రెడ్డి వెల్లడించారు.
అధ్యక్షుడిగా తన ప్రణాళికలు చెప్పకుండా... ఇతరులను విమర్శించడం సరికాదన్నారు. స్వయంగా మోదీనే మిషన్ భగీరథను పొగిడారని గుర్తు చేశారు. కిషన్‌రెడ్డి-లక్ష్మణ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. సంజయ్‌కి దమ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టాలని జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు.