బాలాజీ తండాలో ఎమ్మెల్యే హరిప్రియ పాదయాత్ర

ABN , First Publish Date - 2020-12-12T04:32:46+05:30 IST

బాలాజీ తండాలో ఎమ్మెల్యే హరిప్రియ పాదయాత్ర

బాలాజీ తండాలో ఎమ్మెల్యే హరిప్రియ పాదయాత్ర
బాలాజీ తండాలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే హరిప్రియ

డోర్నకల్‌ (గార్ల) డిసెంబరు 11: ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మండలంలో 15 రోజులపాటు గడపగడపకు పాదయాత్ర చేసి పల్లెనిద్ర ద్వారా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ఉద్దేశంతో శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మండలంలోని బాలాజీ తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. సాగుచేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించాలని కొందరు రైతులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌ గౌతమ్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని ఆమెకు వినతిపత్రాలు అందజేశారు. ఎంపీపీ మూడ్‌ శివాజీ చౌహాన్‌, జడ్పీటీసీ ఝాన్సీలక్ష్మి, సర్పంచ్‌ శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వడ్లముడి దుర్గాప్రసాద్‌, ఎంపీటీసీలు నాగరాజు, రమేష్‌, ఫరంగన్‌, మర్రిగూడెం సర్పంచ్‌ భుక్య బుజ్జి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పానుగంటి రాధకృష్ణ ఉన్నారు. 

Updated Date - 2020-12-12T04:32:46+05:30 IST