క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2020-11-06T06:02:47+05:30 IST

క్రీడలతో స్నేహాభావంతోపాటు మానసికోల్లాసం, శారీరక ధృడత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు

క్రీడలతో మానసికోల్లాసం

ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణారెడ్డి


మొగుళ్లపల్లి, నవంబరు 5: క్రీడలతో స్నేహాభావంతోపాటు మానసికోల్లాసం, శారీరక ధృడత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలను ప్రభుత్వం  ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామీణ క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం  కొర్కిశాల మోడల్‌ స్కూల్‌ వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కలపల్లిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ యార సుజాత, జడ్పీటీసీ జోరుక సదయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింగారావు, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌ ధర్మారావు, ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T06:02:47+05:30 IST