టీఆర్‌ఎస్‌ పాలన దేశానికే ఆదర్శం: చల్లా

ABN , First Publish Date - 2020-12-14T04:22:03+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని తన స్వగృహంలో సంగెం మండలం వంజరపల్లి సర్పంచ్‌ పెంతల స్రవంతితోపాటు పలువురు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌  పాలన దేశానికే ఆదర్శం: చల్లా
ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వంజరపల్లి కాంగ్రెస్‌ నాయకులు

టీఆర్‌ఎస్‌  పాలన దేశానికే ఆదర్శం: చల్లా

సంగెం, డిసెంబరు13:  టీఆర్‌ఎస్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని తన స్వగృహంలో సంగెం మండలం వంజరపల్లి సర్పంచ్‌ పెంతల స్రవంతితోపాటు పలువురు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు నరహరి, ఎంపీటీసీ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.


వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌ : గీసుగొండ మండలం ధర్మారంనకు చెందిన మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు కొమ్ముల కిశోర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే హన్మకొండలోని తన స్వగృహంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 


Updated Date - 2020-12-14T04:22:03+05:30 IST