ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇళ్లు పంపిణీ చేసిన తండాలో ఇంటింటి సర్వే
ABN , First Publish Date - 2020-06-16T19:57:49+05:30 IST
నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం బిబి పూర్ తండాలో వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం బిబి పూర్ తండాలో వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దీనికి ముందు శనివారం తండాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తండాలో ఇంటింటి సర్వే నిర్వహించి ఐదుగురు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి వైద్యాధికారులు హోం క్వారంటైన్ చేశారు.