మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలిస్తోంది: హరీశ్ రావు
ABN , First Publish Date - 2020-08-23T01:37:25+05:30 IST
మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ యజ్ఞం ఎంతగా ..
సిద్దిపేట: మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ యజ్ఞం ఎంతగా విజయవంతమైందో ఈ వర్షాకాలం కళ్లకు కట్టినట్టు నిరూపిస్తోందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పటిష్టమైన మత్తడులు జలపాతాలను తలపిస్తున్నాయని చెప్పారు. వర్షాలతో చెరువులన్నీ నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.