మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-07-19T08:07:16+05:30 IST

ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించే మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. భగీరథపై ఉన్నతాధికారులతో...

మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం: ఎర్రబెల్లి

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించే మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. భగీరథపై ఉన్నతాధికారులతో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథలో వినియోగించిన ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ విధానాన్ని రోల్‌ మోడల్‌గా తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ లేఖలు రాయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

Updated Date - 2020-07-19T08:07:16+05:30 IST