వెనకబడ్డ ‘భగీరథ’

ABN , First Publish Date - 2020-12-20T04:35:19+05:30 IST

వెనకబడ్డ ‘భగీరథ’

వెనకబడ్డ ‘భగీరథ’
నెక్కొండలో జరిగిన మండల సభలో మిషన్‌ భగీరథ ఏడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే

అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

నెక్కొండ, డిసెంబరు 19 : మిషన్‌ భగీరథ పథకం ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో మండలంలో వెనుకబడిందంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీపీ జాటోతు రమేశ్‌ అధ్యక్షతన శనివారం జరిగిన మండల సభకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటి వరకు 40శాతం పనులు జరిగాయని అధికారు లు చెప్పడంతో డీఈ మంగిలాల్‌,  ఏఈ వెంకటేశ్వర్లపైన ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే పథకం నీరుగారుతోందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు, రైతు వేదికలు నిర్మాణాలు జరిపినా బిల్లులు అందక అప్పుల ఊబీల్లో కూరుకుపోతున్నామంటూ పలు గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో బిల్లులు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, సమావేశ హాలు సరిపోకపోవడంతో అధికారులు  హాలు ఎదురుగా కూర్చున్నారు. అంశం వచ్చినప్పుడు సదరు శాఖాధికారిని పిలిచి విషయం తెలుసుకున్నారు. సమావేశంలో జడ్పీటీసీ సరోజన, ఎంపీడీవో సాహితీమిత్రా, సొసైటీల చైర్మన్‌లు రాము, దామోదర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


నర్సంపేట: వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షు డు గోనె యువరాజ్‌, హమాలీ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ కోరారు. క్యాంప్‌ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 

క్రిస్మస్‌ సందర్భంగా పట్టణంలోని బిలివర్‌ చర్చిలో ఎమ్మెల్యే దుస్తులను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఫాస్టర్లు బెన్నీరెవా, పరికి రవి, పిబిరూబెన్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, జడ్పీటీసీ కొమాండ్ల జయ మ్మ, ఎంపీపీ కళావతి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజని తదితరులు పాల్గొన్నారు.


Read more