బీడీఎల్‌లో పేలిన క్షిపణి?

ABN , First Publish Date - 2020-11-27T08:12:02+05:30 IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్‌ పరిధిలోని భారత్‌ డైనమిక్స్‌ (బీడీఎల్‌)లో ఓ ఆయుధం పొరపాటున

బీడీఎల్‌లో పేలిన క్షిపణి?

 కకావికలమైన వ్యవసాయ కూలీలు

 క్షిపణి అయ్యి ఉంటుందని అనుమానాలు

పటాన్‌చెరు రూరల్‌, నవంబరు 26: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్‌ పరిధిలోని భారత్‌ డైనమిక్స్‌ (బీడీఎల్‌)లో ఓ ఆయుధం పొరపాటున పేలింది. అది క్షిపణి కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక పొలాల్లో పనిచేసే రైతు కూలీల కథనం ప్రకారం.. బీడీఎల్‌ వద్ద గురువారం ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మందుగుండు గోళం గాల్లో మండుతూ.. సమీపంలోని పొలాల్లో పడింది. ఆ శబ్దానికి అక్కడ పనిచేస్తున్న కూలీలు చెల్లాచెదురైపోయారు.


‘‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆకాశంలోంచి దూసుకుపోయింది. ఆ శబ్దానికి దద్దరిల్లిపోయాం. తర్వాత కొద్దిసేపటికి బీడీఎల్‌ భద్రతాసిబ్బంది తనిఖీలు జరిపారు. పొలాల్లో ఏమైనా మందుగుండు ఆనవాళ్లు ఉన్నాయా? అని పరిశీలించారు’’ అని ఘటన జరిగిన సమయంలో బీడీఎల్‌ సమీపంలోని పత్తి చేనులో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ మంగ తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై బీడీఎల్‌ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


Updated Date - 2020-11-27T08:12:02+05:30 IST