మిస్డ్‌కాల్‌ ప్రేమ...ఒక్కటైన జంట

ABN , First Publish Date - 2020-11-26T09:08:29+05:30 IST

మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన వారి వివాహానికి ఒక్క మిస్డ్‌కాల్‌ కారణమయ్యింది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన గైగట్టు రూతు తమ బంధువుల్లో ఒకరికి చేసిన ఫోన్‌కాల్‌ అనుకోకుండా విలేజ్‌ కేసముద్రానికి

మిస్డ్‌కాల్‌ ప్రేమ...ఒక్కటైన జంట

మహబూబాబాద్‌ రూరల్‌, నవంబరు 25: మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన వారి వివాహానికి ఒక్క మిస్డ్‌కాల్‌ కారణమయ్యింది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన గైగట్టు రూతు తమ బంధువుల్లో ఒకరికి చేసిన ఫోన్‌కాల్‌ అనుకోకుండా విలేజ్‌ కేసముద్రానికి చెందిన గుండెల మురళికి వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు.. మనసులు కలిశాయి. అయితే వారి పెళ్లికి మురళి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారిని పెద్దలు ఒప్పించి బుధవారం మహబూబాబాద్‌ అనంతాద్రి ఆలయంలో రూతు-మురళి పెళ్లి చేశారు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. రూతు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోయారు. ఒక చెల్లెలు ఉంది. గుంతకల్లులోని పిన్ని వద్ద ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ రూతు జీవించేది. 

Updated Date - 2020-11-26T09:08:29+05:30 IST