గిట్టుబాటు ధర లేక మిర్చి రైతుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-03-02T21:44:44+05:30 IST

వరంగల్ జిల్లా: గిట్టుబాటు ధరలేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గిట్టుబాటు ధర లేక మిర్చి రైతుల ఇబ్బందులు

వరంగల్ జిల్లా: గిట్టుబాటు ధరలేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌కు లక్షలాది క్వింటాళ్ల మిర్చిలోడు వస్తున్నప్పటికీ సరైనగిట్టుబాటుధర దక్కడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమ్మకానికి తీసుకువస్తే కనీసం కూలి డబ్బులు కూడా రావడంలేదన్నారు. కూలి ఖర్చు, పెట్టుబడులు బాగా పెరిగాయని, తీరా అమ్మకానికి తీసుకువస్తే రేట్లు పడిపోయాయని.. పెట్టుబడి కూడా రాలేదని వాపోయారు. మిర్చి పంటలో వచ్చే రోగాల కోసం మందులు కొడుతున్నామని, వాతావరణ మార్పులవల్ల పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు. సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-02T21:44:44+05:30 IST