ఏ క్షణమైనా మిరాలం చెరువుకు గండి పడే అవకాశం

ABN , First Publish Date - 2020-10-21T17:26:29+05:30 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.

ఏ క్షణమైనా మిరాలం చెరువుకు గండి పడే అవకాశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక పాతబస్తీ విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాతబస్తీలోని ప్రజానీకం ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. పాతబస్తీలోని మిరాలం చెరువుకు వరద భారీగా వచ్చి చేరుకుంటోంది. ఏ క్షణమైనా మిరాలం చెరువుకు గండి పడే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే చెరువు పక్కనే ఉన్న జూపార్క్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుకుంది. ఏ క్షణం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-10-21T17:26:29+05:30 IST