సీఎం కేసీఆర్ హామీతో సంతృప్తి వ్యక్తిం చేసిన మైనారిటీస్ కమిషన్
ABN , First Publish Date - 2020-09-18T23:04:18+05:30 IST
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రాంగణంలో మసీదు, మందిరం, చర్చిలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన పై తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రాంగణంలో మసీదు, మందిరం, చర్చిలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన పై తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం కమిషన్ ఛైర్మన్ మహ్మద్ ఖమృద్దిన్ ఆధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహ్మద్ఖమృద్దిన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్చేసిన ప్రకటనపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మసీదు, మందిరం పునర్నిర్మాణంతో పాటు చర్చికూడా నిర్మిస్తామని చెప్పడం సంతోషకరమని అన్నారు. కమిషన్‌కు ప్రత్యేక కార్యాలయం విషయం ప్రిన్సిపల్ సెక్రటరీ(జీఏడీ) పరిశీలనలో ఉందని త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
అలాగే వైస్‌ఛైర్మన్, కమిషన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ అంశం కూడా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి పరిశీలనలో ఉందన్నారు. కమిషన్ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో కమిషన్ వైస్‌ఛైర్మన్ శంకర్ లూకె , సభ్యులు గుస్తినోరియా, మహ్మద్ అర్షద్అలీఖాన్, డా. విద్యా స్రవంతి, ఎంఏ అజీమ్, బి.కట్టయ్య, సర్ధార్ సురేందర్సింగ్, సెక్రటరీ హరీశ్చందర్సాహు తదితరులు పాల్గొన్నారు.