మైనర్‌ నిర్బంధం.. నివేదిక కోరిన హెచ్చార్సీ

ABN , First Publish Date - 2020-06-06T09:20:38+05:30 IST

భైంసా సీఐ ఓ మైనర్‌ను పోలీ్‌సస్టేషన్‌లో నిర్బంధించి వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీకి శుక్రవారం మానవ ..

మైనర్‌ నిర్బంధం.. నివేదిక కోరిన హెచ్చార్సీ

హైదరాబాద్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): భైంసా సీఐ ఓ మైనర్‌ను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీకి శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ) నోటీసులిచ్చింది. ఈ ఘటనపై బాధ్యతాయుతమైన అధికారితో విచారణ జరిపించి.. జూలై 7లోగా నివేదికను తమకు సమర్పించాలని నిర్దేశించింది. మైనర్‌ అయిన తన కుమారుడిని అకారణంగా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారంటూ జక్కుల సావిత్రి హెచ్చార్సీని ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన హెచ్చార్సీ.. కరీంనగర్‌ డీఐజీకి నోటీసులిచ్చింది. కాగా, యాదాద్రి జిల్లా రామన్నపేట పీఎ్‌సలో ఓ వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేశారనే ఆరోపణలపై రాచకొండ సీపీకి హెచ్చార్సీ నోటీసులిచ్చింది. దీనిపై ఆగస్టు 4లోగా తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. 

Updated Date - 2020-06-06T09:20:38+05:30 IST