వరంగల్‌లో పర్యటిస్తున్న మంత్రులు

ABN , First Publish Date - 2020-08-18T16:52:30+05:30 IST

ఓరుగల్లు నగరంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటిస్తున్నారు.

వరంగల్‌లో పర్యటిస్తున్న మంత్రులు

వరంగల్: ఓరుగల్లు నగరంలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటిస్తున్నారు. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడంవల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని కేటీఆర్ అన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కాలనీల ప్రజలను కోరారు. తాత్కాలిక సాయం చేయడంతోపాటు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు.

Updated Date - 2020-08-18T16:52:30+05:30 IST