పొలాల్లో కూలీలతో మంత్రి

ABN , First Publish Date - 2020-10-07T06:27:06+05:30 IST

వరి చేలల్లో కలుపు తీస్తున్న కూలీల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యక్షమవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఇల్లంద

పొలాల్లో కూలీలతో మంత్రి

వర్ధన్నపేట, అక్టోబరు 6 : వరి చేలల్లో కలుపు తీస్తున్న కూలీల మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యక్షమవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఇల్లంద శివారులో అటుగా వెళ్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పక్కనే ఉన్న పొలాల్లో కలుపు తీస్తున్న వారి వద్దకు వచ్చి పలకరించారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో కలిసి కూలీలతో ముచ్చటించారు. అనంతరం రెవెన్యూ చట్టానికి మద్దతుగా పొలంలో గులాబీ జెండాను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ మడ్డి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more