కట్టడిలో ‘రెవెన్యూ’ పాత్ర కీలకం: ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-08T10:23:02+05:30 IST

కరోనా కట్టడిలో రెవెన్యూ ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. రెవెన్యూ ఉద్యోగుల సేవలపై ప్రముఖ గాయని

కట్టడిలో ‘రెవెన్యూ’ పాత్ర కీలకం: ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌/బాల్కొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో రెవెన్యూ ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. రెవెన్యూ ఉద్యోగుల సేవలపై ప్రముఖ గాయని అలపించిన పాటల సిడీని గురువారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాల్లో క్వారంటైన్‌/ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ, వలస కార్మికులను ఆదుకోవడానికి తీసుకునే చర్యల్లో రెవెన్యూ ఉద్యోగులు ముందున్నారన్నారు. మరోవైపు.. ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న 250 మంది వలస కూలీలకు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి భోజనం పెట్టించారు. వారిని రాష్ట్ర సరిహద్దు వరకు వాహనాల ద్వారా పంపించారు.  

Updated Date - 2020-05-08T10:23:02+05:30 IST