హైవేలపై నర్సరీల ఏర్పాటుకు స్థలాలు గుర్తించండి- మంత్రి వేముల
ABN , First Publish Date - 2020-06-23T23:18:58+05:30 IST
రోడ్లకు ఇరువైపుల ఆహ్లాదకరమైన రంగు రంగుల మొక్కలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, రోడ్లపై ప్రయాణం చే సేప్పుడు వాహన దారులు ప్రకృతిని ఆస్వాదించే విధంగా చూపరులను ఆకట్టుకునే మొక్కలను నాటాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్: రోడ్లకు ఇరువైపుల ఆహ్లాదకరమైన రంగు రంగుల మొక్కలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, రోడ్లపై ప్రయాణం చే సేప్పుడు వాహన దారులు ప్రకృతిని ఆస్వాదించే విధంగా చూపరులను ఆకట్టుకునే మొక్కలను నాటాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బిశాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమం పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఆర్‌అండ్‌బి పెద్దయెత్తున మొక్కలునాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేషనల్ హైవేల పై , హైవే నర్సిరీలు ఏర్పాటుచేయాలన్నారు.హైవేల పై నర్సిరీల ఏర్పాటుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో గల రోడ్లపై 20 అనువైన స్థలాలను గుర్తించాలని అన్నారు. వీటికి హై వే నర్సిరీలుగా నామకరణం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని 2458 కి.మీ. మేర ఉన్నరోడ్లకు ఇరువైపులా 9లక్షల 97వేల 326 మొక్కలు ఈసారి హరితహారం కార్యక్రమంలో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, హైవే అథారిటీ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.