45 లక్షల తాటి, ఈత చెట్ల పెంపకం: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-06-19T10:44:37+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటనున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా

45 లక్షల తాటి, ఈత చెట్ల పెంపకం: శ్రీనివాస్‌గౌడ్‌

బర్కత్‌పుర, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటనున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కంఠమయ్య హరిత చాలెంజ్‌ వాల్‌పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నీరా ఉత్పత్తిని ప్రారంభించనున్నదని, ఇందుకోసం జలవిహార్‌లో 3 కోట్ల వ్యయంతో నీరా స్టాల్‌ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-06-19T10:44:37+05:30 IST