ఎన్నికల నాటి హామీలన్నీ నెరవేర్చాం: తలసాని

ABN , First Publish Date - 2020-09-21T06:11:04+05:30 IST

‘ఎన్నికల ప్రతి హామీని నెరవేర్చాం.. మాది గాలి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. గత ప్రభుత్వాల హామీలన్నీ

ఎన్నికల నాటి హామీలన్నీ నెరవేర్చాం: తలసాని

కరీంనగర్‌/గోదావరిఖని, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల ప్రతి హామీని నెరవేర్చాం.. మాది గాలి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. గత ప్రభుత్వాల హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి’ అని మంత్రి తలసాని శ్రీనివా్‌స యాదవ్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రగతి, పల్లె పగ్రతి, రైతు వేదికలు, హరిత హారం వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దేశంలో ఎక్కడా లేవన్నారు. భట్టి విక్రమార్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బండి  సంజయ్‌కు దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తేవాలని సవాల్‌ చేశారు. 

Updated Date - 2020-09-21T06:11:04+05:30 IST