రూ.30కోట్లతో సికింద్రాబాద్‌ బస్‌టెర్మినల్స్‌ అభివృద్ధి- తలసాని

ABN , First Publish Date - 2020-06-18T20:32:39+05:30 IST

వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నబస్‌టెర్మినల్స్‌ను రూ.30కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు సనత్‌నగర్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు

రూ.30కోట్లతో సికింద్రాబాద్‌ బస్‌టెర్మినల్స్‌ అభివృద్ధి- తలసాని

హైదరాబాద్‌: వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నబస్‌టెర్మినల్స్‌ను రూ.30కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు సనత్‌నగర్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌లోని బస్టాప్‌, ఫుట్‌పాత్‌లు ఇతర పలు అభివృద్ధిపనులు జరుగుతున్నతీరును పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి బస్‌స్టాప్‌లను అందంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ధీమ్‌పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సంకల్పించారని తెలిపారు. 


ఇక్కడికి రోజుకు కొన్నిలక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్‌టెర్మినల్స్‌ అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసి, ట్రాఫిక్‌, ఇతర శాఖల సమన్వయంతో వీటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టుచెప్పారు. ఇక్కడ బిచ్చగాళ్లను కూడా రూపుమాపుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికీ ఉపాధి కలిగేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. కేటీఆర్‌ మున్సిపల్‌శాఖ మంత్రి అయ్యాక గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. దేశమంతా కరోనా సంక్షోభం ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసి లాక్‌డౌన్‌ పీరియడ్‌ను అద్భుతంగా వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. లాక్‌డౌన్‌ముగిశాక రోడ్లపైకి వచ్చిన జనం రోడ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  

Updated Date - 2020-06-18T20:32:39+05:30 IST