అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే-తలసాని

ABN , First Publish Date - 2020-07-18T21:58:51+05:30 IST

ప్రజావసరాల నిమిత్తం చేపట్టే అభివృద్ధిపనులకు అడ్డంకిగా ఉన్నఅక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే-తలసాని

హైదరాబాద్‌: ప్రజావసరాల నిమిత్తం చేపట్టే అభివృద్ధిపనులకు అడ్డంకిగా ఉన్నఅక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బేగంబజార్‌లోని ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద 2.25 కోట్ల రూపాయల వ్యయంతో స్టీల్‌గైడర్‌లతో నిర్మిస్తున్నవంతెన పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఒక నిర్మాణం నాలా పనులకు అడ్డంకిగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా నాలా నిర్మాణ పనులకు వాటర్‌పైప్‌లైన్‌ అడ్డుగా ఉందని, వాటర్‌వర్క్స్‌, హెచ్‌ఆర్‌డి అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులుసాగేలా చూడాలని అన్నారు. స్థానిక వ్యాపారులు, ప్రజలు కూడా తమ వాహనాలను ఇష్టమొచ్చినట్టు నిలపకుండా అధికారులకు సహకరించాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నవిద్యుత్‌స్తంభాలను వెంటనే షిఫ్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎలక్ర్టిల్‌ డీఈ శ్రీధర్‌ను ఆదేశించారు. ఈ నాలా వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు , వ్యాపారుల సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌, పరమేశ్వర్‌సింగ్‌, జోనల్‌కమిషనర్‌ ప్రావీణ్య, హెచ్‌ఆర్‌డి సీఈ రాయమల్లు, వాటర్‌వర్క్స్‌ జీఎం వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T21:58:51+05:30 IST