జగన్‌కు మంత్రి తలసాని ప్రత్యేక ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-06-17T04:00:31+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కు‌ను కల్పిస్తూ ....

జగన్‌కు మంత్రి తలసాని ప్రత్యేక ధన్యవాదాలు

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కు‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్  శాసనసభ ఆమోదం తెలపడం ఎంతో హర్షించదగ్గ  విషయమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను  పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వంశ పారంపర్య హక్కు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో  జగన్ యాదవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-17T04:00:31+05:30 IST