టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తోనే పోటీ
ABN , First Publish Date - 2020-11-21T09:28:39+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని, కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ మాత్రమే టీఆర్‌ఎ్‌సకు పోటీ ఇస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ

మీడియాలో హైప్‌నకు ఓ పార్టీ యత్నం
మంత్రి తలసాని
సికింద్రాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని, కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ మాత్రమే టీఆర్‌ఎ్‌సకు పోటీ ఇస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. వేరే పార్టీలతో తమకు పోటీ లేదన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట్ (అత్తెల్లి అరుణశ్రీనివా్‌సగౌడ్), బన్సీలాల్‌పేట్ (హేమలత), బేగంపేట్ (మహేశ్వరి), సనత్‌నగర్-కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండ మార్కెట్ (ఆకుల రూపహరికృష్ణ)ల నామినేషన్ ర్యాలీకి శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, టీఆర్‌ఎస్ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో తలసాని మాట్లాడారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లకుపైగా టీఆర్‌ఎస్ గెలుస్తుందని, మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో సైతం కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉందని అన్నారు. వార్తా పత్రికలు, ఎలకా్ట్రనిక్ మీడియాలో ఓ పార్టీ నేతలు హైప్ సృష్టించుకునేందుకు చూస్తున్నారేతప్ప, దానితో టీఆర్‌ఎ్‌సకు ఒరిగేది కానీ, పోయేది కానీ ఏమీ లేదన్నారు. ఎన్నికల బరిలో దిగేటప్పుడు తాము చేసే పనులు, చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం సంప్రదాయమన్నారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని ప్రజలు సహించరన్నారు.