లక్ష ఇళ్లు ఒకే చోట కడతారా?..మేము పారిపోలేదు: మంత్రి తలసాని
ABN , First Publish Date - 2020-09-20T16:56:04+05:30 IST
అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డబుల్ బెడ్‌రూం ఇళ్ల వివాదం కొనసాగుతోంది.

కరీంనగర్: అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డబుల్ బెడ్‌రూం ఇళ్ల వివాదం కొనసాగుతోంది. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో భట్టికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లక్ష ఇండ్లను ఒకే చోట కడతారా? అని ప్రశ్నించారు. తాము పారిపోలేదని... పనికి రాని వ్యక్తుల గురించి మాట్లడేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి తీసుకెళ్లిన చరిత్ర గతంలో లేదన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని కడుతున్నామో లెక్కలు ఇస్తామని తెలిపారు. వాస్తవాలను భట్టి చూసి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదారు ప్రాంతాల్లోనే లక్ష ఇళ్లు చూపిస్తారా? అని నిలదీశారు. తాను ముందు నడుస్తుంటే.. ఏవేవో తిడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.