హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలి- తలసాని

ABN , First Publish Date - 2020-06-26T20:20:39+05:30 IST

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు.

హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలి- తలసాని

హైదరాబాద్‌: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హరితహారంలో భాగంగా సనత్‌నగర్‌నియోజక వర్గంలోని పద్మారావునగర్‌పార్క్‌, ముషీరాబాద్‌నియోజక వర్గంలోని సుందరయ్య పార్క్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తోనూ, అంబర్‌పేట నియోజక వర్గంలో డిడికాలనీలోని రామకృష్ణ నగర్‌పార్క్‌లో ఎమ్మెల్యే కాళేరు వెంకటేశ్‌ తదితరులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పెద్దయెత్తున మొక్కలను నాటి పెంచడం వల్ల స్వచ్చమైన వాతావరణం ఏర్పడి ఆరోగ్యవంతమైన జీవితాన్నాగడప వచ్చని వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ ఇండ్ల వద్ద, పరసరాల్లో మొక్కలను నాటాలని అన్నారు.


భావితరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, సంపూర్ణ ఆరోగ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23శాతంగా ఉన్న అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. పచ్చదనం పెంచడం వల్ల ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చని, సకాలంలో వర్షాలు కూడా కురుస్తాయని చెప్పారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలు పూర్తి అవగాహన పెంచుకుని మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. 

Updated Date - 2020-06-26T20:20:39+05:30 IST