కరోనా కట్టడికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది- తలసాని

ABN , First Publish Date - 2020-06-23T19:25:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది- తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కరోనాలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ కూడ తప్పని సరి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్‌, ముఠాగోపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 150 డివిజన్లలో ఆగస్టు15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో ఏం జరిగిందన్న దానిపై మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.


హైదరాబాద్‌ జనాభా కోటిపైనే ఉంది. పాజిటివ్‌ కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు ఈ కేసులతో మరిణిస్తున్నారో మీడియా వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. కరోనాకు ఎవరూ అతీతులు కాదన్నారు. కరోనా బారిన పడిన వారు చాలా మంది కోలుకుంటున్నారని మంత్రి తెలిపారు. బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది. అందుకే పనికి మాలిన ఆలోపణ లుచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు ఈసమయంలో ఆస్పత్రుల వద్ద ధర్నాలు చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. తెలంగాణలో  కరోనా కట్టడి చర్యలను కేంద్ర బృందం, వైద్య శాఖ మంత్రి ప్రశంసించారని అన్నారు.


ఢిల్లీలో మర్కజ్‌ సందర్భంగా కరోనా బ్రలితే కేంద్ర ఇంటిలిజెన్స్‌ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వలస కార్మికులను ఇబ్బందికి గురి చేసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఐసిఎంఆర్‌గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని, ప్రతి పక్షాలకు ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలలియడం లేదన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించడం, ఎత్తేయడం కేంద్రం ఇష్టానుసారంగా చేసిందని తలసాని విమర్శించారు.


Read more