సనత్ నగర్ నియోజక వర్గంలో మంత్రి తలసాని సుడిగాలి ప్రచారం
ABN , First Publish Date - 2020-11-21T20:19:57+05:30 IST
తన స్వంత నియోజక వర్గమైన సనత్‌నగర్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సుడిగాలి పర్యటనలుచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్దులను గెలిపించుకునేందుకు ఆయన ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.

హైదరాబాద్: తన స్వంత నియోజక వర్గమైన సనత్‌నగర్‌లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సుడిగాలి పర్యటనలుచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్దులను గెలిపించుకునేందుకు ఆయన ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. నియోజక వర్గంలోని రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట నియోజక వర్గాల అభ్యర్ధుల గెలిపించుకునేందుకు పెద్దయెత్తున ప్రచారాన్ని ఉధృతం చేశారు. రాంగోపాల్‌పేట డివిజన్ అభ్యర్ధి అత్తెల్లి అరుణగౌడ్‌కు మద్దతుగా కళాసిగూడ, జవహర్‌జనతా, బర్తన్‌కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. అమీర్‌పేట డివిజన్ అభ్యర్ధి శేషుకుమారి విజయం కోసం కుమ్మరిబస్తీ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.