జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 104 సీట్లు ఖాయం: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-10-07T21:54:25+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 104 సీట్లు తప్పకుండా వస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 104 సీట్లు ఖాయం: మంత్రి తలసాని

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 104 సీట్లు తప్పకుండా వస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ గతంలో గెలిచినన్ని సీట్లు కూడా ఈసారి గెలవలేవన్నారు.


ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు ప్రారంభించాలని సినీ పరిశ్రమ ముందుకు వస్తే ప్రభుత్వం వెనకాడబోదని మంత్రి స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం థియేటర్లు ప్రారంభించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. థియేటర్ల యజమానులు ఒక నిర్ణయం తీసుకుని తన వద్దకు వస్తే చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. థియేటర్ల యాజమాన్యాలు కూడా కొంతమంది తెరిస్తే బాగుంటుందని, మరికొంతమంది ఇంకొంత కాలం ఆగితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారని మంత్రి తెలిపారు. 

Read more