కేటీఆర్‌ పిలుపుతో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన పెరుగుతుంది- తలసాని

ABN , First Publish Date - 2020-05-10T19:29:50+05:30 IST

పరిసరాల పరిశుభ్రత పై ప్రతి ఆదివారం పది నిమిషాలు అంటూ మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు.

కేటీఆర్‌ పిలుపుతో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన పెరుగుతుంది- తలసాని

హైదరాబాద్‌: పరిసరాల పరిశుభ్రత పై ప్రతి ఆదివారం పది నిమిషాలు అంటూ మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మారేడ్‌పల్లిలోని తన నివాసంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వమించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని ఇచ్చిన పిలుపుతో ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల ను నివారించ వచ్చన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.  ఈసందర్భంగా మంత్రి తలసాని చెట్ల మొదళ్లలో శుభ్రం చేయడం, దోమల నిర్మూలనకు మందు స్ర్పే చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా  కార్పొరేటర్‌లు శేషుకుమారి, అత్తెల్లి అరుణ, కొలన్‌లక్ష్మీ, ఆకుల రూప, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-10T19:29:50+05:30 IST