నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు వాగుతున్నారు- తలసాని

ABN , First Publish Date - 2020-12-19T20:52:05+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరుగరు అన్నట్టుగా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని

నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు వాగుతున్నారు- తలసాని

సూర్యాపేట: గ్రేటర్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్లు పొద్దెరుగరు అన్నట్టుగా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గం పరిధిలోని ఆకుపాముల గ్రామంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద ముంపునకు గురైన కుటుంబాలకు 25వేల చొప్పున ఆర్ధిసాయం అందించకుంటే ప్రజలే మీపై తిరగబడతారని అన్నారు. 


దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేవలం రెండు ఎన్నికల్లో గెలుపుకే బిజెపి నాయకులు విర్రవీగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికే వినియోగించాలన్నారు. పదే పదే ముఖ్యమంత్రి ని అరెస్ట్‌చేస్తామంటున్నారు. మీకు అంత ధైర్యం ఉందా? అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటుస్థానిక నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T20:52:05+05:30 IST