అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు: తలసాని

ABN , First Publish Date - 2020-11-25T22:31:11+05:30 IST

అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు: తలసాని

హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ కు చెందినా ఆలిండియా ముస్లీం  బిసి ఆర్గనైజేషన్ అధ్యక్షులు  హైమద్ హుస్సేన్ తన అనుచరులు మహమూద్ అలీ, మహ్మద్ అజీమోద్దిన్ లతో కలిసి మంత్రి తలసాని, డివిజన్ ఇంచార్జి, ఎంఎల్ సి పురాణం సతీష్, ఎంఎల్ఏ ఆత్రం సక్కు, కార్పొరేటర్ అభ్యర్ధి కొలన్ లక్ష్మి  సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతి ని కలిగించేలా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి జీహెచ్ఎంసి ఎన్నికలలో తగిన బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ను ప్రజలు కోరుకుంటున్నారని, అది టీఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు.


ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్ మేయర్ పీఠం ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Read more