అభివృద్ధికే ఓటు వేసి గెలిపించాలి- తలసాని
ABN , First Publish Date - 2020-11-25T20:11:34+05:30 IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినంత అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినంత అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్‌నగరాన్నివిశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. గతంలో ప్రభుత్వాలు మాటలతోనే కాలం వెళ్లదీస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల్లో నిరూపించిందన్నారు. జంటనగరాల్లో జరుగుతున్న అభివృద్దిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారని అన్నారు. బుధవారం సనత్‌నగర్‌నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట,తో పలు పలు ప్రాంతాల్లో మంత్రి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో మంత్రికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బల్దియా పీఠం పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రతి పక్షపార్టీలు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దానిని ప్రజలు నమ్మరని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తదితరులు ఉన్నారు.