బీజేపీ నేతలవి తప్పుడు ప్రచారాలు: తలసాని

ABN , First Publish Date - 2020-11-22T00:41:00+05:30 IST

తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలవి తప్పుడు ప్రచారాలు: తలసాని

హైదరాబాద్: తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారని  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ గెలుపుకోసం  పాదయాత్ర,  ఇంటింటి ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి జీవో ఇప్పించాలని సవాల్ చేశారు.ప్రశాంతంగా ఉన్న నగరంలో మాటలతో విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, జీహెచ్ఎంసి ఎన్నికలలో మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.


Read more