ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తలసాని
ABN , First Publish Date - 2020-10-01T20:27:59+05:30 IST
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం సనత్ నగర్ లోని కెయల్రార్ పార్క్ వద్ద త్వరలో జరగనున్న హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్స్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 కు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 6 వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.