ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం స్పందించదా?
ABN , First Publish Date - 2020-10-21T10:21:39+05:30 IST
రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం సహా యం అందించదుగానీ కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పెద్ద పోటుగాళ్లలాగా..

బీజేపీ నేతలు పోటుగాళ్లలా మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని
మంగళ్‌హాట్, అక్టోబర్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం సహా యం అందించదుగానీ కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పెద్ద పోటుగాళ్లలాగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌కే పేట్‌లో ఇటీవల గోడకూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. మంగళవారం మంత్రి తలసాని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బాధిత కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాల వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.