సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-03-16T20:39:01+05:30 IST
పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు
హైదరాబాద్: పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేతలు కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పెద్దయెత్తున అసోసియేషన్ నేతలు మంత్రిని ఆయన కార్యాలయం వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రవీందర్‌కుమార్, ఎస్.సహదేవ్, నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎంబి కృష్ణాయాదవ్, కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.