బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-06-24T00:36:52+05:30 IST

కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులను ఆదుకోవాలి

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను జంటనగరాలు, రంగారెడ్డిజిల్లా బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌కలిసి వినతి పత్రాన్నిసమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలను గౌరవిస్తూ మార్చి 15వతేదీ నుంచి బార్‌లనుమూసి ఉంచామని వారు తెలిపారు. దీని వల్ల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నట్టు వారు మంత్రికి వివరించారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ లైసెన్స్‌ దారులన ఉఆదుకోవాలని వారు కోరారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. 

Read more