టీ-ఫిట్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-12-14T00:02:19+05:30 IST

రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు

టీ-ఫిట్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మైండ్‌ అండ్‌బాడీ ఫిట్‌గా ఉంటే జీవితంలో ఏదైనాసాధించవచ్చని అన్నారు. సీఐఐ, యుఆర్‌ లైఫ్‌ సంస్ధలు సంయుక్తంగా ఆదివారం హైటెక్స్‌లో నిర్వహించిన వెల్‌నెస్‌రన్‌ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 


ఈసందర్భంగా మంత్రి టీ-ఫిట్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలు రోజుకు కనీసం 20 నిమిషాలు ఫిట్‌నెస్‌ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

Updated Date - 2020-12-14T00:02:19+05:30 IST