‘రైజ్‌ ఆఫ్‌ సిరిసిల్ల’ డాక్యుమెంటరీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-08-02T00:08:15+05:30 IST

తెలంగాణ రాష్ట్రసమతి రాష్ట్రనాయకుడు, ఐవీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ నిర్మాతగా రూపొందిన రైజ్‌ ఆఫ్‌ సిరిసిల్ల అనే డాక్యుమెంటరీని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం తెలలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు

‘రైజ్‌ ఆఫ్‌ సిరిసిల్ల’ డాక్యుమెంటరీ ఆవిష్కరణ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమతి రాష్ట్రనాయకుడు, ఐవీఎస్‌  రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ నిర్మాతగా రూపొందిన రైజ్‌ ఆఫ్‌ సిరిసిల్ల అనే డాక్యుమెంటరీని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం తెలలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. సిరిసిల్ల నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, మంత్రి కేటీఆర్‌ అన్నిరంగాల్లో సిరిసిల్లను ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని వివరిస్తూ ఉప్పల శ్రీనివాస్‌ నేతృత్వంలో డైరెక్టర్‌ పూర్ణ చందర్‌ ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, మహబూబాబాద్‌ ఎంపి కవిత, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-02T00:08:15+05:30 IST