గీత వృత్తిదారులను ప్రోత్సహించడానికే నీరా పాలసీ- శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-07-10T22:56:44+05:30 IST
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గీత వృత్తిదారులను ప్రోత్సహించడానికే నీరా పాలసీని ప్రకటించారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

మేడ్చల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గీత వృత్తిదారులను ప్రోత్సహించడానికే నీరా పాలసీని ప్రకటించారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం నీరా పాలసీని ప్రకటించి గౌడ్‌ల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిలుగు వృక్షము గత కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జీలుగు వృక్షం ద్వారా నీరాను అందిస్తున్నట్టుచెప్పారు. ఈ జీలుగు వృక్షం నాటిన 6 సంవత్సరాల నుంచి నీరాను అందిస్తుందన్నారు. ఒక్కోజీలుగు వృక్షం రోజుకు 40 నుంచి 50 లీటర్ల వరకు నీరాను అందిస్తుందన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి గీత వృత్తిదారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, ఔషధ గుణాలు గల నీరాను సేకరించి ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు.
దేవతలు సైతం సురాపానకంగా సేవించారని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నారు. నీరాలో ఉంటే ఔషధ గుణాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీరా పాలసీనిప్రవేశ పెట్టి గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్, గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్, మున్సిపల్ ఛైర్మన్‌సన్న శ్రీశైలంయాదవ్, జీలుగు వృక్షం ద్వారా నీరాను అభివృద్ధి చేస్తున్న విష్ణుస్వరూప్‌రెడ్డి, అశ్విత్‌రెడ్డి, సైంటిస్ట్ సురేష్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.