రక్త దానంతో ప్రాణాలు నిలబెట్టండి: శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-04-21T08:14:37+05:30 IST
రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టాలని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గాయని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. భాగ్యనగర్ టీఎన్‌జీవోఏ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడలోని ఐపీఎం సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఆయన విన్నవించారు. మరోవైపు.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా హైదరాబాద్ తరువాత తొలిసారిగా పాలమూరు జనరల్ ఆస్పత్రిలో కరోనా డిటెక్షన్ స్టేషన్‌ను మంత్రి శ్రీనివా్‌సగౌడ్ సోమవారం ప్రారంభించారు.