ఏపీ జీవో ఏకపక్షం: నిరంజన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-05-13T09:22:39+05:30 IST
శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ

మహబూబ్‌నగర్, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం ఏకపక్ష నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఏపీ జీవోను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదన్నారు.