1/70 భూములకు యాజమాన్య హక్కులపై త్వరలోనే స్పష్టత: మంత్రి సత్యవతి
ABN , First Publish Date - 2020-10-01T07:14:02+05:30 IST
అటవీ భూములకు యాజమాన్య హక్కులు, సాగులో ఉన్న రైతులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని గిరిజన, స్ర్తీశిశు సంక్షేమ...
ములుగు, సెప్టెంబరు 30: అటవీ భూములకు యాజమాన్య హక్కులు, సాగులో ఉన్న రైతులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని గిరిజన, స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, సానుకూలంగా స్పందించిన ఆయన రాష్ట్రంలోని ప్రతీ అంగుళాన్ని డిజిటల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో దీని ద్వారా భూములకు హక్కులు, యాజమాన్యంపై స్పష్టత వస్తుందని చెప్పారన్నారు. ములుగు జిల్లాలో మంత్రి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం, ఎల్‌ఆర్‌ఎ్‌సపై కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మాట్లాడారు. 1/70 చట్టం పరిధిలోని ప్రాంతాలు, అటవీ భూముల్లో ఎంతమంది గిరిజనులు ఉన్నారో అదేస్థాయిలో గిరిజనేతరులు కూడా ఉన్నారని, వారందరికీ ఏ విధంగా హక్కులు కల్పించాలనే విషయమై విధివిధానాలు రూపొందించే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.