సత్వరం గోదాముల నిర్మాణం: సత్యవతి
ABN , First Publish Date - 2020-05-17T09:48:28+05:30 IST
ధాన్యం నిలువ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన గోదాములు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేస్తున్నామని, వరంగల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా...

హన్మకొండ టౌన్, మే 16: ధాన్యం నిలువ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన గోదాములు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేస్తున్నామని, వరంగల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వరంగల్ కార్పొరేషన్, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని తాగునీటి సమస్య, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వలస కూలీల సమస్యలపై శనివారం హన్మకొండలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని వర్గాలు సమన్వయంతో పని చేయడం ద్వారా కోవిడ్-19ను వరంగల్‌లో నియంత్రించగలిగామని మంత్రి అన్నారు.