ఆత్మగౌరవానికి ప్రతీకలు రైతువేదికలు

ABN , First Publish Date - 2020-12-27T04:49:10+05:30 IST

ఆత్మగౌరవానికి ప్రతీకలు రైతువేదికలు

ఆత్మగౌరవానికి ప్రతీకలు రైతువేదికలు
కేసముద్రంలో సొసైటీ రుణాల చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

మంత్రి సత్యవతి రాథోడ్‌ 

కేసముద్రం, డిసెంబరు 26 : రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో నిర్మించిన రైతు వేదికలు వారి తుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో నిర్మించిన రైతు వేదిక లు వారి ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని గిరిజన స్ర్తీ, శిశు సం క్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేసముద్రంలో శనివారం ధన్నసరి సొసైటీ భవనం, రైతు వేదికలను మంత్రితోపాటు ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ప్రారంభించారు. అనంతరం హరిహర గార్డెన్స్‌లో 220 మందికి రూ.79.03లక్షల సొసైటీ రుణాలను మంత్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా 24 గంటలు కరెంట్‌ అందిస్తున్నారని తెలిపారు. దశాబ్ధాల తరబడి నీళ్లు రాని కాల్వల్లోకి కాళేశ్వరం నీరు వస్తోందని అన్నారు. రూ.35వేల కోట్లతో ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధా న్యం ఖరీదులు చేపట్టారని తెలిపారు. దళారులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగినరీతిలో బుద్ధిచెప్పాలని అన్నారు. ఎంపీ మాలోత్‌ కవిత ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మర్రి రంగారావు, జడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచులు భ ట్టు శ్రీను, ఎన్నమాల ప్రభాకర్‌, ఎంపీటీసీలు సట్ల వెంకన్న, కొమ్ము స్వాతి, దామెరకొండ ప్రవీణ్‌, డీఏవో చత్రునాయక్‌, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రోజారాణి పాల్గొన్నారు. కేసుల పాలైన ఉద్యమకారులకు పింఛన్లు ఇవ్వాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కాగా, కేసముద్రంలో ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌ల పర్యటన నేపథ్యంలో ఇనుగుర్తిలో మండలం ఏర్పాటు చేయాలని ప్లకార్డులను ప్రదర్శించారు.

Updated Date - 2020-12-27T04:49:10+05:30 IST