మొక్కలను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత: మంత్రి సబిత

ABN , First Publish Date - 2020-07-22T18:00:59+05:30 IST

మొక్కలను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత: మంత్రి సబిత

మొక్కలను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత: మంత్రి సబిత

వికారాబాద్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సబిత ఆరవ విడత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. పరిగి మండలం రంగంపల్లి అటవీ ప్రాంతంలో నాటిన 36,400 మొక్కల సంరక్షణపై అధికారులను ఆరా తీశారు. మొక్కలను సంరక్షిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హాయ్‌ను మంత్రి ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అధికారి చాలా అవసరమని పేర్కొన్నారు. హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలని, మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ కూడా ఓ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-22T18:00:59+05:30 IST