కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సేవలు అనిర్వచనీయం: మంత్రి సబిత

ABN , First Publish Date - 2020-09-05T14:43:40+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సేవలు అనిర్వచనీయం: మంత్రి సబిత

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు మరవలేమన్నారు.  ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారి సేవలు అనిర్వచనీయమని కొనియాడారు.  విద్యార్థుల భవిష్యత్తు కోసం డిజిటల్, ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-05T14:43:40+05:30 IST