రాష్ట్రంలోని అన్నిమున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్‌ ఏర్పాటు-పువ్వాడ

ABN , First Publish Date - 2020-07-20T01:08:42+05:30 IST

రాష్ట్రంలోని అన్నిమున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ అన్‌వీల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్రంలోని అన్నిమున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్‌ ఏర్పాటు-పువ్వాడ

ఖమ్మం: రాష్ట్రంలోని అన్నిమున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ అన్‌వీల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు తొలిసారిగా ఖమ్మం కలెక్టరేట్‌ ప్రాంతంలో మేయర్‌ పాపాలాల్‌తో కలిసి షి మొబైల్‌ బయోటాయిలెట్స్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అజయ్‌ కుమార్‌ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్‌) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్టుచెప్పారు. ప్రస్తుతం సామాజిక టాయిలెట్స్‌ నిర్మాణం   పై దృష్టిసారించామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే అవసరమైన చోట్ల టాయిలెట్స్‌ ఆన్‌వీల్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవలే ఆదేశించారని అన్నారు. 


నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన స్ర్తీ టాయిలెట్స్‌ను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు. వీటిని తక్కువ వ్యవధిలో పూర్తిచేయడంతో పాటు కావాల్సిన చోటకు తరలించే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సాధ్యమైనంత మేరకు త్వరగా అన్నిబయో టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. సమీపం ఆర్టీసీ డిపోల నుంచి కాలం చెల్లిన బస్సులను తీసుకుని వాటిని స్ర్తీ టాయిలెట్స్‌గా మార్చాలని ఇప్పటికే సూచించినట్టు మంత్రి తెలిపారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్స్‌ కోసం వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు.


వీటిని రద్దీ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ప్రార్దనా మందిరాలు, నిర్మాణాలు జరుగుతున్న్రపాంతాలు, వారాంతపు అంగళ్లు వంటి ప్రాంతాలకు తరలించ వచ్చని తెలిపారు. వీటి నిర్వహణను స్లమ్‌లెవల్‌ఫెడరేషన్స్‌ లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిలా సంఘాలు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-07-20T01:08:42+05:30 IST